'ఈనెల 14న జరిగే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

'ఈనెల 14న జరిగే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

VZM: ఈనెల 14న రాజాం కోర్టు ఆవరణలో జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి శారదాంబ సూచించారు. బుధవారం లోక్ అదాలత్‌కు సంబంధించి న్యాయవాదులు, బ్యాంక్‌, మున్సిపల్‌, తదితర అధికార్లతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కేసుల పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ ఎంతగానో దోహద పడుతుందన్నారు.