ఎస్‌ఈ గోవిందరావు మృతి.. ఎమ్మెల్యే సంతాపం
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ జి.గోవిందరావు విధి నిర్వహణలో అకాలంగా మరణించడం తీవ్రంగా కలచివేసిందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. నిజాయితీ, కర్తవ్యనిష్ఠ, అంకితభావంతో ప్రజాసేవకు అంకితమైన ఆయన మరణం తీరని లోటని తెలిపారు. పరమపదించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.