VIDEO: రోడ్డుపై పేరుకుపోయిన చెత్తాచెదారం
ABD: భోరాజ్ మండలం బాలాపూర్ గ్రామంలో ప్రధాన రోడ్డుపై చెత్తాచెదారం పేరుకుపోయి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. చెత్త కారణంగా దోమలు వ్యాప్తి చెందడంతో పాటు, దుర్వాసన వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ముక్కు మూసుకుని రాకపోకలు సాగించాల్సి వస్తోందని అంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.