కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులని గెలిపించండి: ఎమ్మెల్యే
పెద్దపల్లి: ఎమ్మెల్యే విజయరమణరావు బుధవారం జూలపల్లి మండలం వడ్కాపూర్, వెంకట్రావుపల్లి, కుమ్మరికుంట గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ గ్రామాల్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ఆయన అన్నారు.