పిడుగుపాటుతో రైతు మృతి

పిడుగుపాటుతో రైతు మృతి

వికారాబాద్: పిడుగుపాటుతో రైతు మృతి చెందిన ఘటన యాలాల మండలంలో బెన్నూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. గొల్ల వెంకటయ్య(62) అనే రైతు తన భార్య ఎల్లమ్మతో కలిసి పొలంలో పనులు చేస్తుండగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షంలో పడింది. ఈక్రమంలో వెంకటయ్య ఉన్న సమీపంలో పిడుగుపడగా ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఎల్లమ్మ కొద్ది దూరంలో ఉండటంతో ప్రమాదం తప్పింది.