తాగునీటి సమస్యకు పరిష్కారం
MBNR: మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని 5, 6 వార్డుల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి గ్రామ పంచాయతీ చర్యలు చేపట్టింది. సర్పంచ్ జె. రామ్లాల్ ఆధ్వర్యంలో వేసవి దృష్ట్యా గురువారం కొత్త బోరు త్రవ్వించారు. ప్రజలకు నీటి కొరత లేకుండా చూస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరేందర్ రెడ్డి, టి.ఏ. ఆంజనేయులు, వార్డు సభ్యులు రహీం, శ్రీనివాస్, అనిత పాల్గొన్నారు.