VIDEO: కనీస వేతనంపై అంగన్వాడీలు నిరసన

CTR: తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. సోమవారం పుంగనూరు, రాంపల్లి సమీపానగల ICDS ప్రాజెక్టు కార్యాలయం వద్ద వారు బైఠాయించి నిరసన తెలిపారు. ఇందులో భాగంగా వారు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పని గంటలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరారు.