'ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలి'

KMR: ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ జరిగేలా చర్యలు తీసుకోవాలని సదాశివ నగర్ MROకు బీజేపీ నాయకులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. సదాశివనగర్ మండలంలో యూనియన్ బ్యాంకు పరిధిలో 6000 మంది రైతులు రుణం తీసుకున్నారని ఇందులో 2500 మందికి రుణమాఫీ కాలేదని తెలిపారు. పద్మావతి వాడి సొసైటీలో గల రైతులకు కొందరికి రెండు లక్షల రుణమాఫీ కాలేదని తెలిపారు.