'జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక'
సత్యసాయి: జిల్లాలోని మండల, డివిజన్, మునిసిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ప్రజల నుంచి ప్రత్యక్షంగా వినతులు స్వీకరించనున్నట్టు చెప్పారు. దరఖాస్తులు కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేకుండా meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని సూచించారు.