సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
NRML: ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. అలాగే రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా బాసరలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు, పక్కా ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ వివరించారు.