ప్లాస్టిక్ వ్యర్ధాల యూనిట్‌ను సందర్శించిన అదనపు కలెక్టర్

ప్లాస్టిక్ వ్యర్ధాల యూనిట్‌ను సందర్శించిన అదనపు కలెక్టర్

BDK: చుంచుపల్లి మండలం నందతండాలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్‌ను అదనపు కలెక్టర్ విద్యా చందన ఆదివారం సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న కార్యకలాపాలను పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. గ్రామంలో ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలను సక్రమంగా సేకరించి శుద్ధి చేయాలన్నారు.