సివిల్స్‌లో రాణించిన విద్యార్థులకు మంత్రి అభినందనలు
VZM: సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో గజపతినగరం నియోజకవర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు సత్తా చాటడం గర్వంగా ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన ప్రమోద్ విష్ణు యూపీఎస్సీలో ఆల్ ఇండియా 640వ ర్యాంక్ సాధించి ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపిక కావడంతో మంత్రి కార్యాలయంలో శనివారం ఆయనను సత్కరించారు.