మేడిగూడ సర్పంచ్‌గా కొడప ఆనందరావు
ADB: గాదిగూడ మండలంలోని మేడిగూడ గ్రామపంచాయతీ సర్పంచిగా కొడప ఆనందరావు గెలుపొందారు. ప్రత్యర్థి జంగుపై 197 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ గ్రామపంచాయతీలో మొత్తం 8 వార్డులు ఉండగా.. 7 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగితా 1 వార్డుకు ఎన్నిక జరగ్గా.. వాఘ్మారే ధన్రాజ్ గెలుపొందారు. ఉపసర్పంచిగా బన్సుడే యశ్వంత్‌ను ఎన్నుకున్నారు.