VIDEO: జొళ్ళగుడలో గిరిజనులకు తాగునీటి కష్టాలు

ASR: డుంబ్రిగుడ మండలం జొళ్ళగుడ గ్రామంలో తాగునీరు సౌకర్యం కల్పించాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. సరైన తాగునీటి సౌకర్యం లేక కొండ ఒడ్డున వచ్చే కలుషిత ఊట నీటితో తమ గొంతు తడుపుకుంటూ రోగాల బారిన పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి జొళ్ళగుడ గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు.