లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం: సీడీపీవో

ELR: గర్భస్థ దశలో లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని ICDS తాడేపల్లిగూడెం ప్రాజెక్ట్ ఆఫీసర్ సరస్వతి అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం మండలం ఎల్. అగ్రహారం అంగన్వాడీ కేంద్రంలో PCPNDT యాక్ట్, PMMVY కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. లింగ నిర్ధారణ పేరుతో ఆడ శిశువులను చంపవద్దని, వారిని బతకనివ్వాలని కోరారు.