పాల్వంచలో ఘనంగా మెగాస్టార్ జన్మదిన వేడుక

BDK: పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను న్యూ పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు షేక్ ఖాసిం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేద దివ్యాంగులకు, పేదలకు, తైక్వాండో ప్లేయర్ సింధు తపస్వి చేతుల మీదుగా బియ్యం పంపిణీ చేశారు. ఖాసీం మాట్లాడుతూ.. తన అభిమాన నటుడు పుట్టినరోజున ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.