'సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు సంజీవని'

'సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు సంజీవని'

VZM: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు సంజీవని వంటిదని టీడీపీ మండల అధ్యక్షులు కడగల ఆనంద్ కుమార్ వెల్లడించారు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి 15వ వార్డు ధర్మాన అప్పారావుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 1.52 లక్షల చెక్కును గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.