జేవీవీ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
W.G: ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుటకు విద్య, ఆరోగ్య, పర్యావరణ రంగాల్లో విశేష కృషి జనవిజ్ఞానవేదిక చేస్తోందని జేవీవీ జిల్లా గౌరవ అధ్యక్షులు డా. KSPN వర్మ పేర్కొన్నారు. పాలకొల్లులో మంగళవారం జేవీవీ క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జే.రామలక్ష్మణరావు, శ్రీనివాస్, డా. ముత్యాల సిరి చందన, అజయ్ కుమార్, జయదుర్గారావు పాల్గొన్నారు.