ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
కోనసీమ: తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినం తెలుగు సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహత్తరమైన పండుగ అని ఆయన పేర్కొన్నారు. ఉగాది పచ్చడి లోని ఆరు రుచులు జీవితంలోని సుఖ దుఃఖాలను ప్రతిబింబిస్తాయన్నారు. ప్రతి కుటుంబంలో ఆనందాలు నిండాలన్నారు.