'మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలి'
AKP: రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మంగళవారం విజయవాడలో ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు భేటీ అయ్యారు. మొంథా తుఫాను కారణంగా శారదా నదీ పరివాహక ప్రాంతంలో గట్లు కోతకు గురైనట్లు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే ఆనకట్ట గేట్లు మరమతులకు గురైనట్లు మంత్రికి వివరించారు. మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.