జిల్లాలో ముగిసిన మూడో విడత ఎన్నికల ప్రచారం
సూర్యాపేట జిల్లాలో గ్రామపంచాయతీ, వార్డు సభ్యుల ఎన్నికల మూడో విడత ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటి నుంచి బరిలో నిలిచిన వివిధ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొన్నారు. ఈనెల 17న పోలింగ్ జరగనుంది. జిల్లాలోని హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 7 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.