రైల్వే గేట్లను ఢీకొన్న లారీ.. తప్పిన ప్రమాదం

రైల్వే గేట్లను ఢీకొన్న లారీ.. తప్పిన ప్రమాదం

KDP: ముద్దనూరులో సోమవారం ఓ లారీ రైల్వే గేట్లను ఢీకొనగా రైల్వే గేటు విరిగింది. జమ్మలమడుగు నుంచి సిమెంటు లోడుతో ముద్దునూరు వస్తున్న లారీ బ్రేక్ ఫెయిలై అదుపుతప్పి మూసి ఉన్న రెండు రైలు గేట్లను ఢీకొంది. ఆ సమయంలో అక్కడ వాహనాలు లేకపోవడం, రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన కొద్ది క్షనాల్లోనే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు అటుగా వెళ్లింది.