ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంట్లో‌ సిట్ సోదాలు

ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంట్లో‌ సిట్ సోదాలు

కృష్ణా: ఇబ్రహీంపట్నలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై సిట్ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు సంయుక్త సోదాలు నిర్వహించారు. ఈ మేరకు రెండు గంటలపాటు కొనసాగిన ఈ సోదాల్లో పోలీసులు జోగి రమేష్ మొబైల్ ఫోన్, ఆయన భార్య ఫోన్, సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. సాక్ష్యాలను సేకరించిన క్లూస్ టీం తదుపరి విచారణ కోసం ఆధారాలను విశ్లేషిస్తోంది.