VIDEO: హోలీ పండుగ సందర్భంగా కిక్కిరిసిన దుకాణాలు

VIDEO: హోలీ పండుగ సందర్భంగా కిక్కిరిసిన దుకాణాలు

KMR: నిజాంసాగర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం హోలీ పండుగ సందడి నెలకొంది. పండుగను పురస్కరించుకుని మాంసం దుకాణాల వద్ద భారీ రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచే మాంసం ప్రియులు మటన్ దుకాణాల వద్ద బారులు తీరారు. డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాపారాలు జోరుగా సాగడంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.