విమానంలో పొగలు.. తీరా చూస్తే..
HYD: విమానంలో ఒక్కసారిగా పొగాలు రావడంతో ఎయిర్‌లైన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. తీరా చూస్తే.. ఓ ప్రయాణికుడు వాష్ రూమ్‌లో సిగరెట్ తాగుతున్న విషయాన్ని సిబ్బంది గమనించారు. HYDకి చెందిన సయ్యద్ అంజల్ ఆలీ అనే వ్యక్త సౌదీ అరేబీయాకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో విమానంలో రహస్యంగా సిగరెట్ తాగాడు. గమనించిన సిబ్బంది అతడిని నిన్న పోలీసులకు అప్పగించారు. వ్యక్తిపై కేసు నమోదు చేశారు.