టంగుటూరి ప్రకాశం పంతులకు ఘనంగా నివాళులు

ATP: గుత్తి పెన్షనర్ల భవనంలో శనివారం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి కార్యక్రమాన్ని పెన్షనర్ల అసోసియేషన్ అదనపు కార్యదర్శి జన్నే కుల్లయి బాబు, అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వర్ణంబ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తి తీసుకొచ్చారని కొనియాడారు.