పేదలకు సీఎంఆర్ఎఫ్ ఓ వరం

పేదలకు సీఎంఆర్ఎఫ్ ఓ వరం

SKLM: ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల వైద్య సేవలకు సీఎం సహాయ నిధి ద్వారా సహాయం అందించి అండగా ఉంటామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. హిరమండలం మండలం అంబావల్లి గ్రామానికి చెందిన జగదీష్ పండ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్య సేవల నిమిత్తం రూ. 2 లక్షల చెక్కును సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుటుంబ సభ్యులకు అందజేశారు.