గన్నవరంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో సీఎం సహాయనిధి కింద మంజూరైన చెక్కులు, LOCలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం రూ.64,48,920 విలువైన సాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు. వైద్య చికిత్స, అత్యవసర అవసరాల కోసం ఈ సహాయం అందించినట్లు ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.