ప్రపంచకప్ విజయం.. రూ.కోటి బహుమానం

ప్రపంచకప్ విజయం.. రూ.కోటి బహుమానం

మహిళల వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియాకు ప్రైజ్ మనీగా ఐసీసీ రూ.39 కోట్లు, బీసీసీఐ రూ.51 కోట్లు అందించింది. ఈ నేపథ్యంలో, మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రానికి చెందిన భారత క్రికెట్ ప్లేయర్ క్రాంతి గౌడ్‌కు ప్రత్యేకంగా రూ. కోటి బహుమతిని ప్రకటించింది. ఆమె ప్రదర్శన రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడింది.