రహదారి విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
AKP: అచ్యుతాపురం-అనకాపల్లి రహదారి విస్తరణ పనులను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గురువారం మునగపాక వద్ద పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనులను కొనసాగించాలన్నారు. అలాగే వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల ప్రగతిని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చరించారు.