రాయచోటికి మున్సిపల్ కమిషనర్‌గా రమణ రెడ్డి
అన్నమయ్య: రాయచోటి పురపాలక సంఘానికి నూతన మున్సిపల్ కమిషనర్‌గా రమణ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పట్టణ అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.