జిల్లాలో ఏటీఎం చోరీకి యత్నం..

E.G: నిడదవోలు మండలం తాడిమల్ల ఎస్‌బీఐ ఏటీఎం చోరీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. ఇవాళ మధ్యాహ్నం చోరికి ప్రయత్నించిన దొంగలు ముందుగా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం ఏటీఎం మిషన్‌ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో దొంగతనంపై ఎస్బీఐ మేనేజర్ ఫిర్యాదు మేరకు ఎస్సై సుందర్ బాలాజీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.