చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని పిలుపునిచ్చారు.