నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
W.G: తాడేపల్లిగూడెంలో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయనున్నట్లు విద్యుత్ ఈఈ కే. నరసింహమూర్తి తెలిపారు. హౌసింగ్ బోర్డు సబ్ స్టేషన్ పరిధి మున్సిపల్ ఆఫీస్, రైల్వే ఫీడర్లు, పాతూరు సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదనన్నారు. ఈ విషయం గుర్తించి వినియోగదారులు సహకరించాలని కోరారు.