రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
E.G: రాజానగరం జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. బైకుపై రాజమండ్రి వెళ్తుండగా గైట్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌కు నిప్పంటుకుని పూర్తిగా కాలిపోగా, యువకుడు స్పాట్‌లోనే మృతి చెందాడు. బొమ్మూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.