మట్టి రోడ్డు పోయి.. సీసీ రోడ్డు వచ్చే

జగిత్యాల: రూరల్ మండలం కండ్లపల్లి మోడల్ స్కూల్‌కు వెళ్ళే దారి వర్షాకాలంలో బురదమయంగా ఉండేది. గత ఏడాది కండ్లపల్లి, కిష్టంపేట తారు రోడ్డు నుంచి మోడల్ స్కూల్ వరకు సీసీ రోడ్డు వేయాలని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు బురదలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన అధికారులు తారు రోడ్డు నుంచి స్కూల్ వరకు సీసీ రోడ్డు వేసి విద్యార్థులకు బురద లేకుండా చేశారు.