గూడూరు జిల్లా సాధన కోసం ఒకే ఒక్కడు.!
TPT: గూడూరును జిల్లా కేంద్రం చేయాలంటూ భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షుడు కంకణాల పెంచలనాయుడు దీక్షలకు పూనుకున్నారు. ఇప్పటికే జేఏసీ ఆధ్వర్యంలో నెలరోజులపాటు గూడూరులో ఆందోళనలు జరగగా అందుకు భిన్నంగా కంకణాల తనదైన శైలిలో మహాత్మా గాంధీ విగ్రహం ముందు టెంట్ వేసి గూడూరు జిల్లా కేంద్రం చేయాలని పాలకులకు విజ్ఞప్తి చేస్తూ నిరసనకు దిగారు.