తేలకపాటి వర్షాలకే నీరు నిల్వ
ప్రకాశం: మర్రిపూడి మండలం నాయి బ్రాహ్మణ కాలనీలో సైడ్ కాలువ లేకపోవడంతో మురుగునీరు ఇళ్లల్లోకి చేరి, చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి దుర్గంధం వెదజోల్లుతుంది. దీనివల్ల దోమల పెరిగి డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. కాలనీలో సైడ్ కాలువలు నిర్మించి సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.