నేడు టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల

నేడు టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల

భారత్, శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన షెడ్యూల్ ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు విడుదల కానుంది. ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు భాగం కానున్నాయి. ఈ మ్యాచ్‌లు భారత్‌లోని ఢిల్లీ, చెన్నై, ముంబై, అహ్మదాబాద్, కోల్‌కతాతో పాటు శ్రీలంకలోని మూడు వేదికల్లో జరగనున్నట్లు సమాచారం.