మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేసిన కలెక్టర్

VZM: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి ఆద్వర్యంలో కలెక్టరేట్ వద్ద మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు. మట్టి గణపతుల వలన జల కాలుష్యం అవ్వదన్నారు.