ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం
ఫిలిప్పీన్స్ సెబూ నగరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని బోగో సిటీలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూ ప్రకంపనల ధాటికి యూనివర్సిటీ ఆఫ్ ది ఫిలిప్పీన్స్ సెబూ విద్యార్థులు ప్రాణభయంతో తరగతి గదుల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.