లిక్కర్ స్కాంలో మరో ఇద్దరు నిందితులు

లిక్కర్ స్కాంలో మరో ఇద్దరు నిందితులు

ఏపీ మద్యం కేసులో సిట్ మరో ఇద్దరి నిందితులను చేర్చింది. ముంబైకి చెందిన నగల వ్యాపారులు A50గా చేతన్ కుమార్, A51గా రోనక్ కుమార్‌లను నిందితులుగా చేరుస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. రోనక్ కుమార్‌ను నిన్న సాయంత్రం గన్నవరం విమానాశ్రయంలో సిట్ అరెస్ట్ చేయగా.. చేతన్ కుమార్ కోసం గాలిస్తోంది.