సర్పంచ్ ఎన్నికలు.. 5 వార్డులూ ఏకగ్రీవమే.!
VKB: బొంరాస్పేట మండలం పరిధిలో నూతనంగా ఏర్పాటైన పాలబాయితండా గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. సర్పంచ్ అభ్యర్థిగా డేగవత్ సరోజినీ బాయి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవంగా ఖరారైంది. మొత్తం 8 వార్డులకు గాను, 5 వార్డులకు కూడా ఒక్కొక్కరు నామినేషన్ వేయడంతో ఆ స్థానాలూ ఏకగ్రీవమయ్యాయి. తండా వాసులు నూతన సర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.