CMRF చెక్కుల పంపిణీ చేసిన మంత్రి

NDL: ఆపదలో ఉన్నాం అభాగ్యులకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయ నీతి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ మేరకు 20 మంది లబ్ధిదారులకు రూ.31.5 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. కాగా, అత్యవసర సేవల కింద మరో లబ్ధిదారులకు 13 లక్షలు అందిచనున్నారు.