వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

SRPT: హుజూర్‌నగర్ నియోజకవర్గం నేరేడుచర్లలోని కల్వర్టులను జిల్లా కలెక్టర్ తేజ నందలాల్ పవర్ ఇవాళ ఉదయం పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న కల్వర్టుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ స్వయంగా వర్షంలో తడుస్తూ పరిస్థితులను సమీక్షించారు.