ముదిరాజ్ యూత్ కమిటీ అధ్యక్షులుగా దేవుని రంజిత్
MDK: రామాయంపేట మండల కేంద్రంలో ఆదివారం ముదిరాజ్ యూత్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. స్థానిక పెద్దమ్మ దేవాలయం వద్ద సుమారు 300 మంది యూత్ సభ్యుల సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. యూత్ కమిటీ అధ్యక్షులుగా దేవుని రంజిత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 15 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ముదిరాజ్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.