'నగదు చోరీ.. అదుపులోకి ముగ్గురు అనుమానితులు'

VKB: యలాల్ మండల పరిధిలోని అచ్చుతాపూర్ గ్రామంలో గొల్ల శివయ్య అనే వ్యక్తి ఇంట్లో రెండున్నర లక్షలకు పైగా నగదు చోరీ అయ్యింది. పోలీసులు ఈ కేసులో పరిగిలోని మందుల కాలనీకి చెందిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని తమదైన శైలిలో విచారణ చేపట్టారు.