MRO వద్ద ఆత్మగౌరవ నిరసన
CTR: పుంగనూరులో MRPS ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవ నిరసన కార్యక్రమం జరిగింది. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీర్ గవాయి పై ఇటీవల జరిగిన దాడిని ఖండిస్తూ శుక్రవారం పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా MRPS నరసింహులు మాట్లాడుతూ..ఆయనపై దాడి చేసిన నిందితుడిని వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు.