BREAKING: ఎమ్మెల్యేకే డీసీసీ పగ్గాలు
KNR: తెలంగాణ పరిధిలోని జిల్లాలకు DCC అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కరీంనగర్ డీసీసీ అధ్యక్ష బాధ్యతలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు అప్పగించింది. అలాగే కరీంనగర్ కార్పొరేషన్ ఛైర్మన్ బాధ్యతలను V. అంజన్ కుమార్ అప్పగించింది.