మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

NLR: కావలి పట్టణంలోని మాగుంట పార్వతమ్మ రోడ్డుపై గురువారం అపస్మారక స్థితిలో గుర్తుతెలియని వృద్ధ మహిళ పడిపోయి ఉన్నది. అటుగా వెళుతున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ విషయాన్ని గమనించారు. వెంటనే తన కారు దిగి, వృద్ధ మహిళను పరిశీలించారు. వేరొక వాహనం ద్వారా హాస్పిటల్‌కు పంపి తన మానవత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు.